మత్స్యకారేతర ప్యాకేజీ అన్ని గ్రామాలకు యివ్వాలని తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
*******
ముత్తుకూరు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద మల్లూరు, వల్లూరు,తాళ్ళపూడి, దువ్వూరు వారి పాలెం, మామిడి పూడి,పిడతాపోలూరు, గ్రామస్తులు మత్స్యకారేతర ప్యాకేజీ యివ్వాలని ధర్నాచేశారు. వైకాపా నాయకులు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి,పోలిరెడ్డి చిన్నపరెడ్డి , చెంగారెడ్డి, సిపిఐ నాయకులు శిఖరం నరహరి,తుంగా ఏడుకొండలు మద్దతు పలికారు. ఈసందర్భంగా తహసిల్దార్ సుధాకర్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేశారు.ముత్తుకూరు మండలం లోని అన్ని గ్రామాలకు మత్స్యకారేతర ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. థర్మల్ కేంద్రాలు, యాష్ పాండ్, కృష్ణపట్నం పోర్టు వల్ల కాలుష్యం బారిన పడి అన్ని గ్రామాల ప్రజలు యిబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వారం రోజుల్లో అధికారులు స్పందించక పోతే రాస్తారోకో, కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. స్పందిచిన తహసిల్దార్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ యిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *