2019 ఎన్నికలలో కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉదయం సుమారు 20 నిమిషాల పాటు పెళ్లకూరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో పరిస్థితులను చంద్రబాబుకు పెళ్లకూరు వివరించినట్లు తెలిసింది. 2014 ఎన్నికలలో తాను చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ, 2019 ఎన్నికలలో సీటు కచ్చితంగా ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు కు గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు తనకే టికెట్ ఇవ్వాలని, ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో తాను పార్టీ కోసమే పనిచేశానని చెప్పినట్లు తెలిసింది. అంతే కాకుండా జిల్లా పరిస్థితులపై కూడా చర్చించినట్లు సమాచారం. సమస్యాత్మకం కాని ప్రాంతాల అభ్యర్ధుల జాబిత ముందు వెలువడనుండగా, పోటీ ఉండే స్థానాల అభ్యర్ధుల జాబితా తరువాత వెలువడనుందని చెప్పినట్లు తెలిసింది. రెండవ జాబితాలో పేరు ఉంటుందని పెళ్లకూరుకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి నేడు చంద్రబాబుతో జరిగిన భేటీ తరువాత, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గతంలో చెప్పినట్లు బ్యాలెట్ పేపర్ లో ఆయన పేరు కనిపించడం ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *