ఘనంగా ప్రారంభమైన అహోరాత్ర లలితా హవన యజ్ఞం
అమ్మవారి నామస్మరణతో మార్మోగ్రిన దేవీ ఆశ్రమం
హోమగుండంలో పురాతన పద్దతిలో అగ్నిహోత్రాన్ని రగల్చిన పీఠాధిపతి
హజరైన వివిధ రాష్ట్రల భక్త జనులు

లలితా పారాయణంతో దేవీ ఆశ్రమ ప్రాంగణం మార్మోగ్రిపోయింది… ఏకథాటిగా 24 గంటలపాటు నిర్విరామంగా పీఠాధిపతి బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో తెల్లవారుఝామున 6 గంటలకు మొదలైంది. ముందుగా తెల్లవారుఝామున 4 గంటలకు మూలవిరాట్టుకు క్షీరాభిషేకం నిర్వహించిన పిదప యజ్ఞనశాలలో పీఠాధిపతి బాలభాస్కరశర్మ దంపతులు ఇరువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు అయిన అనంతరం హాజరైన భక్తులు అమ్మవారి నామసర్మణ చేస్తుండగా పురాతన పద్దతిల హోమగుండానికి కావలసిన అగ్నిహోత్రంను రగల్చి ఆ అగ్ని కీలకాన్ని అమ్మవారికి చూపి హోమగుండంలో వేసి అహోరాత్ర లలితా నామ హవన యజ్ఞాన్ని ప్రారంభించారు. వచ్చిన భక్తులు అందరూ లలితా నామాలను చదువుతూ అవెసెలను హోమగుండంలో వేస్తూ రేపు ఉదయం 6 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బ్యాచ్ బ్యాచ్ లుగా అటు రుత్వికులు, భక్తులు అమ్మవారి బీజాక్షరాలను వల్లెవేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల వరకూ ఈ హోమం నిర్వరామంగా జరుగుతుందన్నారు. అనంతరం 108 రకాల ద్రవ్యాలతో, పట్టువస్త్రాలతో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాలభాస్కరశర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంతోపాటు మన రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని అందరకి అమ్మ వారి ఆశీసులు కలిగి శాంతిసౌభాగ్యాలతో తులతూగాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో రుత్వికులు అరసవల్లి గ్రామ రుత్వికులు సంతోష్ శర్మ, రామశర్మ, చందుశర్మ, దర్భముళ్ల రామశర్మ, ఆదిత్యశర్మ, ఎం.ప్రకాష్ శర్మ, డి.భగవతి శర్మ, కార్తీక శర్మలతోపాటు ఆశ్రమ రుత్వికులు విశ్వనాధశర్మ, అనంతశర్మ, శివశర్మ, శ్రీనుప్రసాద్ శర్మలతోపాటు శ్రీనుస్వామి, నారాయణరావు, రాధాకృష్ణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *