రేపు పెంచలకొన లో మినీ బ్రహ్మోత్సవం
నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొన లో రేపు రాధసప్తమి పురస్కరించుకుని స్వామి వారి సప్త వాహన సేవలు నిర్వహించనున్నారు.రేపు ఉదయం శ్రీవారికి అభిషేకం.
1)సూర్యప్రభవాహన సేవ.
2)శేష వాహన సేవ.
3)సింహ వాహన సేవ.
4)గరుడ సేవ.
5)చక్రస్నానం.
6)హనుమంత సేవ.
7)అశ్వ వాహన సేవ.
8)చంద్రప్రభ వాహన సేవ కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లును దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకట సుబ్బయ్య పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారు సప్త వాహనాల పై కొలువుదీరి భక్తులకు దర్శనమివనున్నారు.