దూసుకుపోతున్న పెళ్లకూరు.. కోవూరులో పోటీకి సై సిద్ధమైన ప్రచార రథాలు 15న అధికారికంగా ప్రకటన.. టిడిపి తరఫున తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని ఆలోచన… టిడిపి సింబల్ తోనే సిద్ధమైన ప్రచార రధాలు

కోవూరు నియోజకవర్గంలో పోటీకోసం పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సిద్ధమవుతున్నాడు. తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్థానంలో తనకు సీటివ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. గత కొంతకాలంగా కోవూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా తనపేరు బ్యాలెట్ పేపర్ మీద ఉంటుందని చెబుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం తనకీదఫా తెలుగుదేశం సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవూరులో టీడీపీ అభ్యర్థిగా ప్రచారానికి పసుపురంగుతో చైతన్య రథం పేరుతో ఒక వాహనాన్ని కూడా గుంటూరులో సిద్ధం చేస్తున్నారు. దీన్నిబట్టి పోలంరెడ్డికి ఎసరు పెడతాడా లేదా టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉంటాడా లేదా జనసేన టికెట్ పై పోటీ పడతాడా అన్నది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద తన పోటీ అయితే ఖాయమని ఆయన పదే పదే చెబుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *