జర్నలిస్టుల పై దాడులను అరికట్టాలి – ఏపీఈజెఎ

– జర్నలిస్ట్స్ అటాక్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించాలి.

– దాడులకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలి.

నెల్లూరు జిల్లాలో జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులను పోలీసు యంత్రాంగం అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APEJA) డిమాండ్ చేసింది.ఇటీవల గ్రావెల్ మాఫియా దాడికి గురై చికిత్స పొందుతున్న సైదాపురం మండలం ప్రజాశక్తి విలేఖరి రమణయ్య ను మంగళవారం నెల్లూరు సర్వజన ఆసుపత్రి లో జిల్లా ఎపీఈజేఏ బృందం కలిసి పరామర్శించింది.ఈ సందర్బంగా ఏపీఈజేఏ జిల్లా అధ్యక్షుడు గట్టుపల్లి శివకుమార్ ,ప్రధాన కార్యదర్శి ఉడతా రామకృష్ణ లు మాట్లాడుతూ విధినిర్వహణలో నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులకు వృత్తి పరంగా స్వేఛ్చ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.జర్నలిస్ట్ లపై దాడుల నేపధ్యం లో జర్నలిస్ట్ అటాక్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు.ఏపీఈజేఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీజె రమేష్ రెడ్డి , ఏపీఎంఎఫ్ జిల్లా కో – కన్వీనర్ కొప్పోలు.నాగభూషణం లు మాట్లాడుతూ సైదాపురం ఘటనలో భాదితుడికి న్యాయం చేసి దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.నిందితుడికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్ముకాస్తుండడం శోచనీయం అన్నారు.భాదితుడిని పరామర్శించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు ఉడతా శరత్ యాదవ్ , సంయుక్త కార్యదర్శి షేక్ గౌస్ భాషా తదితరులు ఉన్నారు