గుంటూరుజిల్లా

పోలీస్ శాఖ  పై దుషప్రచారం చేస్తే సమాజం నిర్వీర్యమౌతొందని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలోని సన్నిహితం హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కొండవీడు ఉత్సవాల సందర్భంగా కోటయ్య అనే 14 ఎకరాల కౌలురైతు పొలం లో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో తన పంటకు నష్టం వాటిల్లిందంటూ ఆ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ నిమిషానికొక వార్తతో పోలీస్శాఖ పై దుషప్రచారం జరుగుతుందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. గతంలో తమ శాఖలో అవినీతికి పాల్పడిన సిబ్బంది పై కేసులు నమోదు చేయడంతో పాటు వేటు కూడా వేశామని చెప్పారు. అయితే పోలీసులు కొట్టడంతోనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ప్రచారం సరైంది
కాదని అన్నారు. కోటయ్య పురుగు మందు తాగాడనే విషయం ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చినప్పటికీ తమ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉన్న విద్యుత్ శాఖ వాహనంలో కోటయ్యను ఆసుపత్రికి తరలించారని, అయితే చికిత్స పొందుతూ రైతు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమని, విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారని ఎస్పీ తెలిపారు .