గరుడ సేవ లో సేద తీరిన శ్రీవారు

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గరుడ సేవలు దేవేరులతో కలిసి సేదతీరారు ఆదివారం రాత్రి శ్రీవారికి ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవను నిర్వహించారు గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు అశేష జనవాహిని మధ్య శ్రీవారు దేవుని కడప గరుడ వాహనారూఢుడై ఊరేగారు ఈ సందర్భంగా స్వామివారి గరుడ వాహనానికి ఇరువైపులా ఉన్న భక్త జనాన్ని ఆయన కరుణాసముద్రుడైన ఆశీర్వదించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన సేవా గరుడ సేవ స్వామివారి వాహనమైన గరుక్మంతుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానం గా ఉంటుంది ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్లు కృష్ణమోహన్ శేషాద్రి రఘునందన్ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు లక్ష్మి కాసుల దండ ప్రత్యేకంగా స్వామి వారి కోసం తయారు చేయించి అలంకరించారు బ్రహ్మోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆలయ ఇస్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి గ్రామ పెద్దలు కె.వి పార్థసారథి జరుగు రాజశేఖర్ రెడ్డి హనుమంతు ఆకుల కృష్ణ కుమార్ కృష్ణయ్య బాబు గంగన్న సహదేవరెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు శిరీష రెడ్డి తదితరులు పాల్గొన్నారు