గద్వాల సంస్థానానికి పూర్వ వైభవం

  • ముస్తాబవుతిన్న కోటలోని ఆలయాలు

‌ఫిబ్రవరి 17 నుంచి భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

మంత్రాలయ పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు గద్వాల సంస్థానానికి పూర్వ వైభవా న్ని తీసుకొచ్చేలా ఉన్నాయి. ఫిబ్రవరి 17 నుంచి శ్రీ భూ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయేలా ఆలయాని రంగులు వేసి తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ప్రధా న గాలిగోపురంతోపాటు కోట ప్రాంగణంలోని శ్రీరామాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, లక్ష్మి ఆలయం, శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాలు విద్యుద్దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులు ఆలయ వైభవాన్ని చూ సి తిరుపతిని తలపించేలా గద్వాల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ‌శ్రమిస్తున్నారు.

కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు.

శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులైన 1008 సుభురేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 17 ఆదివారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మూలవిరాట్‌కు నిత్య విశేష ఫలపంచామృత అభిషేకంతోపాటు విశేష పుష్పాలంకరణ, పుణ్యహవచనం, సాయంత్రం ఐదున్నర గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు స్వామి వారి హనమద్ వాహనంపై ఊరేగింపు.

ఫిబ్రవరి 18న స్వామివారి కల్యాణోత్సవం, అనంతరం గరుఢవాహనంపై ఊరేగింపు.

ఫిబ్రవరి 19న స్వామి వారి మహారథోత్సవం

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం గుంటి చెన్నకేశవ స్వామి దేవస్థానం వరకు రథోత్సము. ఆ సమయంలో భజన మండలి వారిచే భజన మరియు మంగళ, చండీ వాయిద్యములు, కోలాటాలు, డ్రమ్స్, బాణాసంచా కార్యక్రమాలు నిర్వహించబడును.

ఫిబ్రవరి 20న
శేష వాహన సేవ, చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉంటుందన్నారు.

ఫిబ్రవరి 21న
స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమములు
భూలక్ష్మీ‌ చెన్నకేశవ స్వామి వారి ఉత్సవమూర్తులు గజవాహనముపై షేరేల్లివీధిలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠము వరకు ఊరేగింపు.

ఫిబ్రవరి 22న
సత్యనారాయణస్వామి వ్రతం, స్వామి ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై పెద్ద అగ్రహారంలోని శ్రీఅహోబిళం మఠం వరకు ఊరేగించడం జరుగుతుంది.

రాత్రి పది గంటలకు నాగవళ్లి దేవతా విసర్జన, సర్వ సమర్పణోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమాలు.