మంటగలిసిన మానవత్వం.. ప్రియుడి కోసం కూతురినే చంపేసింది

వేలూరు: వివాహేతర సంబంధం కారణంగా తన ఏడాదిన్నర చిన్నారిని హతమార్చి న కసాయి తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని వాణియంబాడి నేతాజీనగర్‌కు చెందిన నళిని (26)కి బెంగుళూరుకు చెందిన శివకుమార్‌ (30)తో ఏడేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి జీవిత్‌కుమార్‌ (6), జస్వంత్‌కుమార్‌ (5) అనే కుమారులు, ఏడాదిన్నర రిత్విక అనే కుమార్తె ఉంది. దంపతుల మధ్య విభేధాల కారణంగా నళని భర్తను విడిచి రిత్వికను తీసుకొని వాణియంబాడిలోని తల్లి ఇంటిలో ఉంటోంది. ఈ క్రమంలో, చెన్నైకి చెందిన మురళి (29)తో నళినికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు వాణియంబాడిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం రిత్వికకు అనారోగ్యంగా ఉందంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి శరీరంపై గాయాలుండడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీ సులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. బిడ్డ లేకుండా ఇద్దరం చెన్నై వెళ్లి జీవిద్దామనే మురళి చెప్పిన మాటలతో తాను, ప్రేమికుడితో కలసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నళిని అంగీకరించడంతో ఇరువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.