దేవీ ఆశ్రమాన్ని సందర్శించిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి
తప్పకుండా మరలా పౌర్ణమి పూజలకు వస్తా

బిందుమండలవాసినిగా పేరుగాంచిన రాజరాజశ్వేరి అమ్మవారు కొలువై ఉన్న ఏకోత్తర సహస్ర్త శ్రీచక్రమేరువుల దేవీ ఆశ్రమాన్ని సమైక్యాంధ్రాలో డిజిపిగా వ్యవహరించిన దినేష్ రెడ్డి సందర్శించారు. ఆశ్రమ పీఠాధిపతి బాలభాస్కరశర్మ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న 1001 శ్రీచక్రమేరువులను చూసి తప్పకుండా మరలా పౌర్ణమి పూజలకు వస్తానని అన్నారు. ఆశ్రమంలో ఉన్న అ నుండి క్ష వరకూ ఉన్న దేవతా మూర్తులు, అలాగే ఇతర ఉప మందిరాలను కైలాస ప్రస్తార రూపంలో ఉన్న శివలింగ బాణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు