జనసంద్రంగా శ్రీచక్రపురం

దిగ్విజయంగా ముగిసిన 24 గంటల లలితా హోమం

పలు రాష్ట్రాల నుండి భక్తులు రాక

కన్నుల పండుగగా పూర్ణాహుతి

లలితాపారాయణంతో మార్మోగ్రిపోయిన దేవీ ఆశ్రమం

అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని పీఠాధిపతి బాలభాస్కరశర్మ ఆశీర్వచనం

శ్రీకాకుళం నగరానికి కూతవేటు దూరంలో కుంచాల కురమయ్యపేటలో వెలసిన 

శ్రీచక్రపురవాసిని రాజరాజేశ్వరి దేవీ ఆశ్రమంలో కన్నుల పండగా ధుని, ధ్వని ఒక్క క్షణం కూడా విరామం లేకుండా ఆహోరాత్ర లలితాహోమం జరిగింది. ఈ కార్యక్రమం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీచక్రపురపీఠాధిపతి బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో వందలాది మంది సువాసీలు నిన్న ఉదయం 6 గంటల నుండి నేటి ఉదయం 6.30 ని.ల వరకూ నిర్వరామంగా హోమం నిర్వహించారు. జార్జండ్, చత్తీస్ ఘడ్, ఒడిషా, ఇరు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన పలువురు మహిళలు గంటకొక బ్యాచ్ చొప్పున్న ఈ నిర్విరామ హోమంలో పాల్గొని విజయవంతం చేశారు. 7.35 ని.లకు పూర్ణాహుతి కార్యక్రమం పీఠాధిపతి నిర్వహించారు. 108 రకాల పలు ద్రవ్యాలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపురంగు పట్టుచీర, ఎరుపు ఆకుపచ్చరంగుతో మరొక పట్టుచీరలు హోమగుండంకు అర్పించారు. అనంతరం ఆయన వచ్చిన ప్రతీ భక్తునికి ఆయనే స్వయంగా హోమగుండంలోని విబూదిని నుదట దిద్దిన పిదప అందరితో అమ్మవారి వద్ద ఉండే శ్రీచక్రంకు అక్షింతలు దారపోయించారు. సామూహికంగా ఆశీర్వచనం చేసి అనుగ్రహభాషణ చేస్తూ మన ప్రాంతం, దేశం సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి నామస్మరణ చేయడం అందులో బిందుమండలవాసినిగా నివాసం ఉన్న ఈ 1001 శ్రీచక్రమేరువుల వద్ద చేయడం అందరికీ శుభం కలుగుతుందన్నారు. అమ ఇష్టపడే ఈ నామ పారాయణ హోమం 24 గంటల పాటు ధ్వని, ధుని ఆగకుండా వందలాది మంది సువాసీనీలు స్వచ్చంధంగా ముందుకు వచ్చినందుకు వారంత అమ్మకృపకు పాత్రులన్నారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్న  అరసవల్లి, గుజరాతీపేట నుండి వచ్చిన రుత్వికులు టి.సంతోష్ శర్మ, రామకృష్ణశర్మ, చందూశర్మ, డి.రామశర్మ, ఆదిత్యశర్మ, ఎం. ప్రకాష్ శర్మ, డి.భగవతి శర్మ, కార్తీక శర్మ, ఆశ్రమ రుత్వికులు విశ్వనాధశర్మ, అనంతశర్మ, శ్రీనుప్రసాద్ శర్మ, శివశర్మలకు వస్త్రాలతో సత్కరించారు. రుత్వుకుల నుండి వచ్చిన భక్తులు కూడా వేదమంత్రోచ్చరణతో ఆశృర్వచన కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన మహిళా భక్తులకు పీఠాధిపతే స్వయంగా వాయినం ఇచ్చి మరోమారు ఆశ్వీరదించారు.