దేవీ ఆశ్రమంలో ఆహోరాత్ర లలితా హోమం
శుక్రవారం ఉదయం 6 గంట శనివారం ఉదయం 6 గంటల వరకూ
నిర్విరామంగా 24 గంటల పాటు మహిళచే నిర్వహణ
పీఠాధిపతి బాలభాస్కరశర్మ వెల్లడి

శ్రీ చక్ర పురం లో వెలసిన బిందు మండలి వాసినీ అయిన రాజరాజేశ్వరి అమ్మవారికి రేపు శుక్రవారం ఉదయం 5 గంటలకు అమ్మవారి నిజరూప దర్శనంతోపాటు క్షీరాభిషేకం నిర్వహించిన తరువాత 6 గంటలకు ‘ఆహోరాత్ర లలితా హోమం” ప్రారంభించనున్నట్లు దేవీ ఆశ్రమ పీఠాధిపతి బాలభాస్కరశర్మ తెలిపారు. ఉదయం 6 గంటలకు మొదలు పెట్టిన ఈ హోమం మరుసటి రోజు శనివారం ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతుందని ఆయన అన్నారు. మరోపక్కన ఉప ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనన్నట్లు పీఠాధిపతి తెలిపారు.
దేవి ఆశ్రమంలో జరుగు ఈ 24 గంటల పాటు అహోరాత్ర లలిత నామ పారాయణ హోమం అవుతుండగా మరో పక్కన సువాసీలచే లలితా పారాయణం, ఖడ్గమాల, గురుపాదస్తకం, సౌదర్యలహరి పఠన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అహోరాత్ర హోమంలో అరసవల్లి, యలమంచిలి, ఆశ్రమ రుత్వికులతోపాటు తెలుగు రాష్ట్రాల నుండి ఈ హోమం నిర్వహించడానికి మహిళలు కూడా వస్తున్నట్లు బాలభాస్కరశర్మ తెలిపారు. భక్తులు అందరూ ఉదయం ఆరుగంటలకే సంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు. శనివారం 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని అనంతరం అందరికీ హోమం గుండం నుండి తీసిన విభూదిని పీఠాధిపతి బాలభాస్కరశర్మ స్వయంగా అందరికీ ఇస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *