నేడు జమ్ములమ్మ ఉత్సవాలకు అంకురార్పణ

నేడు నడిగడ్డ ఇలవేల్పు జమ్మాలమ్మా జాతర

జమ్ములమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట

తెల్లవారుజామున నుంచే భక్తుల రాక

అన్నిదారులు‌ జమ్ములమ్మా వైపే

ట్రాఫిక్ నివారణకు పోలీసుల చర్యలు

సిసి కెమెరాల నిఘా నీడలో ఆలయం

నేటిలీడర్ మాసపత్రిక: నడిగడ్డ ప్రజల ఇలవేల్పయిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది.‌ ఉదయం నుంచే భక్తుల రాకపోజలతో ఆలయం ప్రాంగణం క్కికిరిసి పోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్‌, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చి దర్శించుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఉదయం ఆలయ నిర్వాహకులు ‌మేళతాలలతో, డోలుతో ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 14 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినట్లు ఈవో పురంధర్‌ కుమార్‌ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భారీగా భక్తులు రావడంతో గద్వాల పోలీసులు ప్రత్యేక ‌నిఘా ఉంచారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

నోట్: : సుదూర ప్రాంతాల నుంచి‌ వాహనాల రాకపోకలు…. కొత్తగా నిర్మించిన రింగ్ రోడ్ ద్వారా కొనసాగించాలని మనవి. పట్టణంలో రైల్వే గేటు పడటం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పాడుతాయి. ప్రతి ఒక్కరు గద్వాల పోలీసులకు సహకరించాలి కోరుచున్నాము.