మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి తదితర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  కోసం చిరంజీవి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. 

దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిరంజీవి, రామ్‌చరణ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘సైరా’ మరో 50 రోజుల షూటింగ్ పార్ట్ మిగిలింది. ఏప్రిల్‌లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. రాజస్థాన్‌తోపాటు రామోజీ ఫిల్మ్ సిటీలో మిగతా షూటింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ పూర్తి చేసి దసరా నాటికి సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 

పండగ సీజన్లో ఎక్కువగా సినిమాలు విడుదలవుతాయి. కాబట్టి పోటీని నివారించే ఉద్దేశంతో ముందుగానే రిలీజ్ డేట్‌ను ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.