క్షణికావేశంలో..

గోదారిలో దూకి గృహిణి ఆత్మహత్య
క్షణికావేశంలో ఇల్లాలి అఘాయిత్యం
మృతురాలు నిజామాబాద్‌ వాసి
బాసర(నిర్మల్): బాసర వద్ద గోదావరి నదిలో దూకి నిజామాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఉదయం భక్తులు చూస్తుండగానే ఆ గృహిణి వంతెనపై నుంచి నదిలో దూకింది. భక్తులు కేకలు వేయడంతో.. ఈ అఘాయిత్యాన్ని గమనించిన జాలర్లు హుటాహుటిన పడవలపై ఆ ప్రదేశానికి వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె నీట మునిగి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో ఆమె అచూకీ కోసం వెతుకుతూ వచ్చిన ఆమె భర్త నిర్జీవంగా పడి ఉన్న భార్యను గుర్తించారు. భోరున విలపించాడు. ఆ ఇల్లాలు నిజామాబాద్‌ పట్టణం ఆదర్శనగర్‌కు చెందిన భవానీ (25)గా తెలిసింది. భవానీ తన రెండేళ్ల వయస్సు పాప శ్రీహర్షను తీసుకుని ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఆమెను వెతుకుతూ తాను వచ్చినట్లు భర్త నికేష్‌ కన్నీరుమున్నీరయ్యాడు. ‘చిన్నపాటి గొడవకు ఇంత పని చేశావా?’ అంటూ రోధించాడు. కాగా ఆ రెండేళ్ల పాప ఆచూకీ తెలియరాలేదు. పాపను ముందే నదిలోకి విసిరి తను కూడా దూకిందా? అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *