మోదీ ఓ పిరికిపంద.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి పదునైన వ్యాఖ్యలతో విరుకుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఓ ‘‘పిరికిపంద’’ అనీ… దమ్ముంటే జాతీయ భద్రత, రాఫెల్ ఒప్పందం, ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై తనతో చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ మైనారిటీ విభాగం నిర్వహించిన ఓ సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఐదేళ్ల పాటు పోరాడిన తర్వాత ఆయన (మోదీ) సంగతేంటో నాకు అర్థమైంది. ఆయనో పిరికిపంద. ఎవరైనా ఆయన ఎదురుగా వచ్చి నిలబడితే.. ఆయన పారిపోతారు…’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మోదీ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుందనీ… ప్రజలను విడదీయడం ద్వారా తాను పాలన సాగించలేనన్న సంగతి ఆయనకు బాగా అర్థమైందన్నారు. ‘‘నరేంద్రమోదీ ప్రజల్లో ఆదరణ కోల్పోయారు…’’ అని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ చీఫ్ విమర్శలు గుప్పించారు. న్యాయ వ్యవస్థ మొదలు ఎన్నికల సంఘం వరకు దేశంలోని అన్ని వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *