గుర్తుతెలియని మహిళ హత్యకు సంబంధించిన సీసీ పూటేజీ లు లభ్యం
గురువారం నాడు రాత్రి అపోలో ఆస్పత్రి సమీపంలో హత్యకు గురైన గుర్తుతెలియని మహిళ (30) సదరు మహిళను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తి కి సంబంధించిన కదలికలు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాల్లో ఫుటేజీల్లో లభ్యమయ్యాయి. ఈ హత్యకు సంబంధించిన కేసు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదయింది. సీసీ కెమెరాల్లో లభించిన ఫుటేజీ, ఫొటోల ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని కరీంనగర్ రూరల్ సిఐ శశిధర్ రెడ్డి కోరారు.

సమాచారం అందించాల్సిన టెలిఫోన్ నెంబర్లు కరీంనగర్ రూరల్ ఏసిపి 9440795106, టాస్క్ ఫోర్స్ ఏసిపి 9701258610, కరీంనగర్ రూరల్ సిఐ 9440795109,సిసిఎస్ ఇన్స్పెక్టర్ 9440795153.

సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడును. నగదు పారితోషికం అందజేయబడును.